స్వీట్ డైమండ్



మైదా  2స్పూన్స్
 ఘీ 1కప్,
ఆయిల్ -అర కప్
యాలకుల పొడి -2స్పూన్స్
పంచదార -ఒక టీ స్పూన్
జీడిపప్పు పలుకులు -అర కప్ 

తయారు  చేసే విధానం :

ముందుగా మైదా లో కొంచం ఘీ వేడి చేసి వేసి ,నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టాలి .పంచదారలో కొంచం నీళ్ళు పోసి పాకం రావాలి . అందులో యాలకుల పొడి వేసి ,తీగ పాకం రాగానే స్టౌ ఆపుచేయాలి . పిండిని చపాతీ లాగా వత్తి డైమండ్ ఆకారం లో చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆయిల్ ,ఘీ వేడి చేసి అందులో వీటిని దోరగా వేఇంచి పాకం లో వేసి కలపాలి . ఘీ లో జీడిపప్పు పలుకులు వేఇంచి పాకం లో వేసి కలపాలి .ఇవి కాసేపటికి విడివిడిగా డైమండ్స్  గ వస్తాయి .

No comments:

Post a Comment